Ali: తెలంగాణ గవర్నర్ ను కలిసిన సినీ నటుడు అలీ

Actor Ali meets Governor Tamilisai

  • తన కూతురు వివాహానికి గవర్నర్ ను ఆహ్వానించిన అలీ
  • గవర్నర్ తమతో ఎంతో అభిమానంగా మాట్లాడారని వెల్లడి
  • గవర్నర్ తో తమిళంలో మాట్లాడానన్న అలీ

ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. హైదరాబాదులోని రాజ్ భవన్ లో ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతూ... తన కూతురు ఫాతిమా వివాహానికి హాజరుకావాలని గవర్నర్ ను ఆహ్వానించానని చెప్పారు. 

తమతో గవర్నర్ ఎంతో అభిమానంగా మాట్లాడారని... చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాను తమిళంలో మాట్లాడంతో ఆమె ఎంతో ఆనందానికి గురయ్యారని చెప్పారు. సినిమాలలో తనను చూడటం ద్వారా తెలుగు నేర్చుకుంటున్నానని గవర్నర్ తనతో అన్నారని... ఈ మాటలు చాలా సంతోషానికి గురి చేశాయని అన్నారు. 

మరోవైపు అలీ తనను కలిసినట్టు తమిళిసై కూడా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన కూతురు వివాహానికి హాజరు కావాలని ఆహ్వానపత్రాన్ని అందించారని చెప్పారు.

Ali
YSRCP
Tollywood
Tamilisai Soundararajan
Telangana
Governor
  • Loading...

More Telugu News