Telangana: ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెయిల్.. షరతులు విధించిన హైకోర్టు

gosha mahal mla gets conditional bail

  • విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్టయిన రాజా సింగ్
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • మీడియాతో మాట్లాడరాదని, ర్యాలీలు చేపట్టరాదని షరతు
  • మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయవద్దని సూచన

విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెయిల్ మంజూరైంది. దాదాపుగా 40 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాజా సింగ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

ఇకపై ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని రాజా సింగ్ కు కోర్టు సూచించింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు కూడా చేయవద్దని సూచించింది. అంతేకాకుండా మీడియాతో మాట్లాడరాదని, ర్యాలీలు చేపట్టరాదని కూడా రాజా సింగ్ కు కోర్టు షరతులు విధించింది. తక్షణమే రాజా సింగ్ ను విడుదల చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Telangana
Raja Singh
BJP
TS High Court
  • Loading...

More Telugu News