Faria Abdullah: ఇక ఫరియా ఆశలన్నీ 'రావణాసుర' సినిమాపైనే!

Faria Abdullah Special

  • 'జాతిరత్నాలు'తో ఫరియా పరిచయం 
  • ఫస్టు సినిమాతోనే వచ్చిన క్రేజ్ 
  • నిరాశ పరిచిన 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'
  •  రవితేజతో చేస్తున్న 'రావణాసుర'పైనే ఆశలు

ఫరియా అబ్దుల్లా పేరు వినగానే ఎవరికైనా 'జాతిరత్నాలు' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో 'చిట్టి' పాత్రలో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఫరియా మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చక్కని కనుముక్కు తీరుతో .. అందమైన నవ్వుతో కుర్రాళ్ల మనసులను కొల్లగొడుతుంది. గ్లామర్ పరంగానే కాదు .. నటన పరంగా కూడా ఆమెకి వంక బెట్టనవసరం లేదు. 

అలాంటి ఫరియా 'జాతిరత్నాల' తరువాత ఫుల్ బిజీ అవుతుందని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' .. 'బంగార్రాజు' సినిమాల్లో తళుక్కున మెరిసిన ఆమె, కథానాయికగా చేసిన రెండో సినిమానే 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'. సంతోష్ శోభన్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించింది. ఈ నెల 4వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే ఆమె ఆశ ఆవిరి కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

సరైన కథ కోసం వెయిట్ చేయడం వల్లనే 'జాతిరత్నాలు' తరువాత గ్యాప్ వచ్చిందనీ, 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' కథ నచ్చడంతో నమ్మకంతో చేశానని ప్రమోషన్స్ లో చెప్పింది. తీరా సినిమా రిలీజ్ తరువాత ఫలితం నిరాశ పరిచింది. ఇంతకాలం పాటు వెయిట్ చేసి ఫరియా చేసింది ఈ సినిమానా? అంటూ ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఆశలన్నీ 'రావణాసుర' సినిమానే ఉన్నాయని చెప్పకతప్పదు.

Faria Abdullah
Santosh Sobhan
Like Share and Subscriibe
  • Loading...

More Telugu News