Netflix: త్వరలో భారత్ లో కూడా నెట్ ఫ్లిక్స్ చౌక ప్లాన్లు?

Netflix may bring cheaper ad supported plan to India soon list of plans it offers now

  • 12 దేశాల్లోకి ప్రకటనలతో కూడిన చౌక నెట్ ఫ్లిక్స్ ప్లాన్లు
  • త్వరలో భారత్ లోనూ ప్రకటించే అవకాశం
  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాలుగు ప్లాన్లు

నెట్ ఫ్లిక్స్ చౌక ప్లాన్లు 12 దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. కానీ భారత్ లో వీటిని ప్రారంభించలేదు. నెట్ ఫ్లిక్స్ లో వీడియో కంటెంట్ చూస్తున్న సమయంలో గంటలో 5 నిమిషాల వరకు ప్రకటనలు ప్రసారం అవుతాయి. ఇది ఫర్వాలేదని భావించే వారు చౌక ప్లాన్లతో కొంత ఆదా చేసుకోవచ్చు. అయితే, 130 కోట్ల జనాభాతో, అతిపెద్ద వినియోగ మార్కెట్ ఉన్న భారత్ లోనూ నెట్ ఫ్లిక్స్ చౌక ప్లాన్లను తీసుకురావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుత ప్లాన్లు..
భారత్ లో నెట్ ఫ్లిక్స్ ప్రస్తుతం నాలుగు నెలవారీ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఒక్కటి మొబైల్ ప్లాన్ కాగా, మిగిలినవి బెసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లు. వీటిల్లో ప్రకటనలు ప్రసారం కావు. 

రూ.149
కేవలం మొబైల్,ట్యాబ్లెట్ లోనే నెట్ ఫ్లిక్స్ కంటెంట్ చూసుకోగలరు. 480 పిక్సల్ రిజల్యూషన్ నాణ్యతకు పరిమితం కావాల్సి ఉంటుంది. కనుక వీడియోలు చూసిన అనుభవం అంత గొప్పగా ఉండదు. ఏక కాలంలో ఒకే డివైజ్ లోనే నెట్ ఫ్లిక్స్ లాగిన్ అవ్వగలరు.

రూ.199
ఇందులో 720 పిక్సల్ రిజల్యూషన్ తో వీడియోలు వీక్షించొచ్చు. నాణ్యత ఫర్వాలేదు. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీలో ఎందులో అయినా కార్యక్రమాలు, సినిమాలు చూడొచ్చు. ఏక కాలంలో ఒకే డివైజ్ లోనే నెట్ ఫ్లిక్స్ లాగిన్ అవ్వగలరు.

రూ.499
ఇందులో వీడియోల నాణ్యత మెరుగ్గా 1080 పిక్సల్ రిజల్యూషన్ తో చూడొచ్చు. ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీలో కార్యక్రమాలు చూసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఏక కాలంలో రెండు పరికరాల్లో నెట్ ఫ్లిక్స్ సేవలు పొందొచ్చు. 

రూ.649
వీడియో నాణ్యత అద్భుతంగా ఉంటుంది. 4కే ప్లస్ హెచ్ డీఆర్ నాణ్యతలో చూసుకోవచ్చు. ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీల్లో నెట్ ఫ్లిక్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఏక కాలంలో నాలుగు పరికరాల్లో నెట్ ఫ్లిక్స్ సేవలు పొందొచ్చు. 

  • Loading...

More Telugu News