Enforcement Directorate: 30 బృందాలతో తెలంగాణలో ఈడీ, ఐటీ ముమ్మర దాడులు

IT and ED Raids in Telangana

  • హైదరాబాద్, కరీంనగర్లోని గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు
  • ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి ఈడీ, ఐటీ అధికారులు
  • ఢిల్లీ నుంచి ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్న ప్రత్యేక బృందాలు

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఐటీ శాఖలు తెలంగాణలో దూకుడు పెంచాయి. బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ కేసుల నిమిత్తం ఈడీ అధికారుల బృందాలు ఈ ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నాయి. దాదాపు 30 బృందాలు హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఐటీ శాఖ అధికారులు తోడుగా హైదరాబాద్ లోని సోమాజిగూడ, అత్తాపూర్ లో పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. కరీంనగర్ లోని గ్రానైట్ వ్యాపారులే లక్ష్యంగా సోదాలు చేస్తున్నాయి. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లఘించారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలపై దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Enforcement Directorate
it
IT Raids
Telangana
Hyderabad
Karimnagar District
  • Loading...

More Telugu News