Subhalekaha Sudhakar: అప్పుడు నాకు అంత ధైర్యం సరిపోలేదు: శుభలేఖ సుధాకర్

Subhalekha Sudhakar Interview

  • నటుడిగా 'శుభలేఖ' సుధాకర్ ది సుదీర్ఘమైన ప్రస్థానం
  • 'సప్తపది' చేయలేకపోయానంటూ వివరణ 
  • కె విశ్వనాథ్ గారు లైఫ్ ఇచ్చారని వెల్లడి 
  • పెద్ద వంశీ గారు ప్రోత్సహించారన్న సుధాకర్ 

తెలుగు తెరపై నటుడిగా శుభలేఖ సుధాకర్ సుదీర్ఘమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. నలుగురు హీరోల్లో ఒకరిగా చేసిన సుధాకర్, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. ఆ తరువాత సినిమాలలో చేస్తూనే, సీరియల్స్ లోనూ బిజీ అయ్యారు. ఇప్పటికీ ఆయన రెండు పడవల ప్రయాణం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కెరియర్ గురించి ప్రస్తావించారు. 

"విశ్వనాథ్ గారు 'సప్తపది' సినిమా చేస్తున్నప్పుడే నేను ఆ సినిమాలో చేయాలనే ఉద్దేశంతో గట్టిగానే ప్రయత్నం చేశాను .. కానీ కుదరలేదు. ఆ సినిమాలో నాకు అవకాశం రాలేదు. ఆ తరువాత రెండేళ్లకి అదే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో 'శుభలేఖ' సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాతో అదే నా ఇంటిపేరుగా మారిపోయింది. 'స్వాతి' .. 'సితార' .. 'రెండు జెళ్ల సీత' సినిమాలతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు' అన్నారు.  

విశ్వనాథ్ గారి తరువాత నాకు ఎక్కువగా అవకాశాలనిస్తూ ప్రోత్సహించిన దర్శకులలో పెద్ద వంశీ గారు .. జంధ్యాల గారు ఉన్నారు. ఆ తరువాత ముత్యాల సుబ్బయ్య గారు .. రేలంగి నరసింహారావు గారు కూడా వరుస అవకాశాలనిచ్చారు. అప్పట్లో నాకు లీడ్ రోల్స్ చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ అలాంటి రోల్స్ చేసే ధైర్యం నాకు లేదు. అందువల్లనే సపోర్టింగ్ రోల్స్ లోనే ఎక్కువగా కనిపించాను' అంటూ చెప్పుకొచ్చారు.

Subhalekaha Sudhakar
K Vishwanath
Vamsi
  • Loading...

More Telugu News