Digvijay Singh: గోవర్ధన పూజ పేరిట గేదెతో దిగ్విజయ్ సింగ్ డ్యాన్సు... విమర్శలు గుప్పించిన బీజేపీ నేత

Digvijay Singh dances with a buffalo

  • తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర
  • స్వాగతం పలికిన దిగ్విజయ్ తదితరులు
  • గోవర్థన పూజలో గేదెను తీసుకురావడంపై విష్ణు స్పందన
  • భారత సంస్కృతికి కాంగ్రెస్ దూరమైందని వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇటీవల తెలంగాణలో ప్రవేశించిన సందర్భంగా పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా స్వాగతం పలికారు. కాంగ్రెస్ నేతలు గోవర్ధన పూజ పేరిట స్వాగత కార్యక్రమం నిర్వహించగా, ఆ వేడుకలో ఓ గేదెతో దిగ్విజయ్ సింగ్ ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. అయితే దీనిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. 

గోవర్ధన పూజ ఓ గేదెతో నిర్వహిస్తారా? అంటూ ప్రశ్నించారు. కనీసం హిందువుల ప్రాథమిక ఆచారాలు కూడా తెలియకుండా, హిందువులను అమితంగా ద్వేషిస్తున్నప్పుడే ఇలాంటివి జరుగుతుంటాయని పేర్కొన్నారు. 

గేదెతో గోవర్ధన పూజలు నిర్వహిస్తుండడం చూస్తుంటే మన దేశ సంస్కృతి నుంచి కాంగ్రెస్ ఎలా దూరం జరిగిందో స్పష్టంగా తెలుస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు. అంతేకాదు, దిగ్విజయ్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా పంచుకున్నారు.

More Telugu News