Vishal: లవ్ మ్యారేజ్ చేసుకుంటా.. నా ప్రియురాలిని పరిచయం చేస్తా: సినీ హీరో విశాల్

Vishal comments on love marriage

  • అభినయతో ప్రేమలో విశాల్ ఉన్నాడంటూ ఇప్పటికే వార్తలు
  • తనకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదన్న విశాల్
  • ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వ్యాఖ్య

హీరోయిన్ అభినయతో హీరో విశాల్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. 'మార్క్ ఆంటోనీ' చిత్రంలో విశాల్ కు భార్యగా అభినయ నటించింది. మరోవైపు, తాజాగా విశాల్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు పూర్తి బలం చేకూర్చేలా ఉన్నాయి. 

తనకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదని విశాల్ అన్నాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని.. త్వరలోనే తాను ప్రేమించిన అమ్మాయిని అందరికీ పరిచయం చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం యాక్టర్స్ యూనియన్ కోసం బిల్డింగ్ కడుతున్నామని... మూడేళ్లలో అది పూర్తవుతుందని... నిర్మాణం పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.

Vishal
love
marriage
Tollywood
Kollywood
  • Loading...

More Telugu News