Allu Sirish: అనూతో లిఫ్ట్ సీన్ కి ఎన్ని టేకులు తీసుకున్నావ్ బాబూ: అల్లు శిరీష్ తో అలీ

Allu Sirish Interview

  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'ఉర్వశివో రాక్షసివో'
  • విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లు 
  • అనూ ఇమ్మాన్యుయేల్ ఇరగదీసేసిందన్న శిరీష్
  • హీరోయిన్ గా ముందుగా అనుకున్నది కూడా ఆమెనే అంటూ వెల్లడి   

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా విడుదలైన రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను కూడా భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అల్లు శిరీష్ పాల్గొన్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్ తో ఈ సినిమాలో అల్లు శిరీష్ చేసిన రొమాన్స్ ను గురించి ప్రస్తావిస్తూ అతణ్ణి అలీ ఆటపట్టించాడు. 

అలీ ప్రశ్నలకు శిరీష్ స్పందిస్తూ .. "కథల విషయంలో మా నాన్నకి మంచి జడ్జిమెంట్ ఉంది. ఈ కథకి నేను సెట్ అవుతానని భావించి నన్ను చేయమని అడిగారు. గతంలో నాన్న గారు వద్దని చెప్పిన కథలను చేసి దెబ్బతిన్నాను. ఇది ఆయనే చేయమన్నారు గనుక చేశాను. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా అనుకున్నది అనూ ఇమ్మాన్యుయేల్ నే. ఆమె ఈ సినిమాలో ఇరగదీసేసింది" అన్నాడు. 

'అంతా బాగానే ఉంది గానీ ఆ లిఫ్ట్ సీన్ ఎక్కడ తీశారు బాబూ?' అంటూ అలీ అడిగాడు. (ఈ సినిమాలో లిఫ్ట్ లో లిప్ లాకుల సీన్ హైలైట్ అయిన సంగతి తెలిసిందే). అందుకు శిరీష్ నవ్వుతూ .."ఆ సీన్ ను ఒక హోటల్లో తీశాము' అంటే, "అక్కడ కంఫర్టుగా ఉంటుందని అలా ప్లాన్ చేశారా? ఎన్ని టేకులు తీసుకున్నావేంటి? నీలో ఈ కోణం కూడా ఉందా? ఇంతకీ ఇంట్లో వాళ్లు ఆ సీన్ చూసి ఏమన్నారేంటి?" అని అలీ అడిగాడు. 'అందరూ ఆటపట్టిస్తున్నారు గానీ అందులో అంతలా ఏవుందనిపిస్తోంది' అని శిరీష్ అనగానే, 'అయితే ఆ సీన్ రీషూట్ చేయిద్దామా? ' అని ఆత్రుతగా అంటూ అలీ నవ్వులు పూయించాడు.

Allu Sirish
Anu Emmanuel
Urvasivo Rakshasivo Movie
  • Loading...

More Telugu News