RRR: జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం.. ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందంటే..!

RRR collections in Japan

  • ఇటీవలే జపాన్ లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్'
  • 17 రోజుల్లో రూ. 10 కోట్ల కలెక్షన్లు
  • తక్కువ రోజుల్లోనే ఎక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ రూ. 1,200 కోట్ల వరకు కలెక్షన్లను సాధించింది. ఒక్క నైజాం ఏరియాలో ఈ చిత్రం రూ. 100 కోట్ల షేర్ ను సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 

మరోవైపు ఈ చిత్రం ఇటీవలే జపాన్ లో కూడా విడుదలయింది. అక్కడ కూడా ఈ చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ నిర్వహించింది. అక్కడ కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తొలి నాలుగు రోజుల్లోనే రూ. 4 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం... 17 రోజుల్లో రూ. 10 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. జపాన్ లో తక్కువ సమయంలోనే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే జపాన్ లో అత్యధిక కలెక్షన్లను సాధించిన భారతీయ చిత్రాల్లో రజనీకాంత్ 'ముత్తు' తొలి స్థానంలో ఉండగా... 'బాహుబలి' రెండో స్థానంలో ఉంది.

RRR
Japan
Collections
Junior NTR
Ramcharan
Rajamouli
  • Loading...

More Telugu News