Amazon Prime: ఏడాదికి రూ.599కే అమెజాన్ ప్రైమ్!

Amazon Prime announced Rs 599 plan Benefits

  • కొత్త ప్లాన్ ను ప్రకటించిన అమెజాన్
  • దీని వ్యాలిడిటీ ఏడాది కాలం
  • ఇది కేవలం మొబైల్ ఓటీటీ ప్లాన్ మాతమ్రే
  • స్టాండర్డ్ డెఫినిషన్ లో వీడియో కంటెంట్ వీక్షణ

అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు మరింత చౌకగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒక నెలకు అయితే రూ.179 పెడితేనే అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ లభించేది. మూడు నెలలకు రూ.459, ఏడాదికి చార్జీ రూ.1,499 చొప్పున ఉంది. కానీ, ఇప్పుడు కేవలం రూ.599 చెల్లించి ఏడాది ప్లాన్  ను తీసుకోవచ్చు. కాకపోతే ఇది కేవలం మొబైల్ ఫోన్ లో వినియోగానికి సంబంధించిన ప్లాన్. స్మార్ట్ టీవీల్లో అమెజాన్ ప్రైమ్ చూడాలంటే పూర్తి స్థాయి ప్లాన్ ను తీసుకోవాల్సిందే.

రూ.599 ప్లాన్ లో స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్డీ) నాణ్యతపై వీడియో కంటెంట్ ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ నుంచి వీక్షించడానికి వీలుంటుంది. హై డెఫినిషన్ వీడియో కంటెంట్ కావాలంటే ముందు చెప్పుకున్నట్టు ఏడాదికి రూ.1,499 ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. రూ.599 ప్లాన్ లో కంటెంట్ ను ఆఫ్ లైన్ లో కూడా చూసుకోవచ్చు. అమెజాన్ ఒరిజినల్స్ లో లైవ్ క్రికెట్ మ్యాచ్ లను సైతం వీక్షించొచ్చు. ఇది ఒక్క మొబైల్ ఫోన్ లోనే పనిచేస్తుంది. ఏడాది ప్లాన్ వద్దనుకునే వారి కోసం నెలకు రూ.89 నుంచి ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

Amazon Prime
yearly plan
Rs 599
mobile plan
  • Loading...

More Telugu News