Rishab Shetty: ఎన్టీఆర్ తో సినిమాపై స్పందించిన 'కాంతార' హీరో!

Rishab Shettty  Tollywood Movie Update

  • 'కాంతార' సినిమాతో రిషబ్ శెట్టికి క్రేజ్ 
  • తెలుగులోను గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా
  • ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్టు ప్రచారం 
  • అలాంటిదేం లేదని చెప్పిన రిషబ్

కన్నడలో కొంతకాలంగా రిషబ్ శెట్టి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంతకుముందు ఆయన నుంచి హిట్ సినిమాలు ఉన్నప్పటికీ, 'కాంతార' సినిమాతో ఆయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇతర భాషల్లోను ఆయన మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక తన తదుపరి సినిమాలు కూడా కన్నడతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయాలనే ఆలోచనలో రిషబ్ శెట్టి ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ హీరోగా ఆయన ఒక సినిమా చేయనున్నాడనే టాక్ కొన్నిరోజులుగా బలంగా వినిపిస్తోంది. హీరోగానే కాదు దర్శకుడిగా కూడా రిషబ్ శెట్టికి మంచి ట్రాక్ రికార్డు ఉండటం .. టాలీవుడ్ లో తన ఫేవరేట్ హీరో ఎన్టీఆర్ అని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం ఈ ప్రచారారానికి మరింత బలాన్నిచ్చింది. 

తాజాగా ఈ ప్రచారాన్ని గురించి రిషబ్ శెట్టి స్పందిస్తూ, "ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ వస్తే అంతకంటే కావల్సిందేముంటుంది? కాకపోతే నేను ముందుగా కథను రెడీ చేసుకుని ఆ తరువాతనే అందుకు తగిన హీరోలను సంప్రదిస్తూ ఉంటాను. ఎన్టీఆర్ కి తగిన కథ సిద్ధమైనప్పుడు తప్పకుండా ఆయనను కలుస్తాను. ప్రస్తుతానికైతే అలాంటి కథలేవీలే నా దగ్గర లేవు" అంటూ ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.

Rishab Shetty
Junior NTR
Kantara Movie
  • Loading...

More Telugu News