Kishan Reddy: మునుగోడులో నైతిక విజయం బీజేపీదే: కిషన్ రెడ్డి

Munugode real victory is BJPs says Kishan Reddy

  • డిపాజిట్ రాని పరిస్థితి నుంచి రెండో స్థానానికి బీజేపీ వచ్చిందన్న కిషన్ రెడ్డి
  • ప్రలోభాలు, బెదిరింపులతో టీఆర్ఎస్ గెలిచిందని విమర్శ
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని ధీమా

కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ధి చెపుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అప్పుడే ఆట మొదలైందని చెప్పారు. మునుగోడులో నైతిక విజయం బీజేపీదేనని అన్నారు. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని పరిస్థితి నుంచి రెండో స్థానానికి బీజేపీ ఎగబాకిందని చెప్పారు. 

మునుగోడులో ప్రలోభాలు, బెదిరింపులతో టీఆర్ఎస్ గెలిచిందని అన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మునుగోడులోనే మకాం వేసి అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇక నుంచి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసిగా పని చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సమాధి కడతామని అన్నారు. తెలంగాణలో రాబోయే ప్రభుత్వం బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy
BJP
TRS
Munugode
  • Loading...

More Telugu News