Munugode: జోరు తగ్గని కారు.. ఏడో రౌండ్ లోనూ టీఆర్​ఎస్ కు​ ఆధిక్యం

TRS leads in munugode poll

  • ఏడో రౌండ్ ముగిసే సరికి 2,555 ఆధిక్యంలో ప్రభాకర్ రెడ్డి
  • వరుసగా నాలుగు రౌండ్లలో ఆధిపత్యం చూపెట్టిన టీఆర్ఎస్
  • మూడో స్థానానికే పరిమితం అయిన పాల్వాయి స్రవంతి

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతోంది. వరుసగా నాలుగో రౌండ్ లోనూ ఆయనకు స్వల్ప ఆధిక్యం లభించింది. ఏడో రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,189 ఓట్లు లభించాయి. బీజేపీకి 6,803 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఏడో రౌండ్ ముగిసేసరికి ప్రభాకర్ రెడ్డి 2,555 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  

ఈ ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ కు తొలి రౌండ్ లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2, 3వ రౌండ్లలో  బీజేపీ ముందుకొచ్చింది. కానీ, వరుసగా 4, 5, 6, 7 రౌండ్లలో టీఆర్ఎస్ కు ఆధిక్యం లభించింది. ఏడవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి  అయ్యేసరికి టీఆర్ఎస్ కు  45,710 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 43,155 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కేవలం 12,025 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

More Telugu News