Korameenu: 'కోరమీను' టీజర్ విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని

Gopichand Malineni launches Korameenu cinema trailer

  • జాలరిపేట కథాంశంతో తెరకెక్కిన చిత్రం
  • 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట' అంటూ కొన్ని రోజులుగా ప్రచారం
  • టీజర్లో మీసాల రాజు ఎవరో వెల్లడించిన టీమ్

ఆనంద్ రవి కథానాయకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'కొరమీను'. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది టైటిల్ కాప్షన్. దర్శకుడు శ్రీపతి కర్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అంటూ కొన్ని రోజుల నుంచి వినూత్నంగా సినిమా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టీజర్లో ఆ మీసాల రాజు ఎవరో చెప్పారు. ''ఈ రోజు జాయిన్ అయిన మీసాల రాజు గారికి జాలరిపేటలో నిన్న రాత్రి ఎవరో మీసాలు తీసేశారని సమాచారం'' అని న్యూస్ యాంకర్ వాయిస్ వినిపిస్తుంటే... స్క్రీన్ మీద మీసాల రాజుగా శత్రును చూపించారు. 

'డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ అసలైన పవర్ భయానిదేరా' అని హరీష్ ఉత్తమన్ చెప్పే డైలాగ్, 'ఇది జాలరిపేట. డబ్బున్నోడు, డబ్బు లేనోడు... అంతే!' అని హీరోయిన్ కిషోరీతో ఆనంద్ రవి చెప్పే మాట... వాళ్ల క్యారెక్టరైజేషన్ల గురించి వివరించేలా ఉన్నాయి.  

ఈ చిత్రంలో రవి, ఉత్తమన్, శత్రు, కిషోరీ దత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ, ప్రసన్న కుమార్, ఆర్కే నాయుడు నటించారు.

Korameenu
Trailer
Malineni Gopichand
Tollywood
Anand Ravi

More Telugu News