Ushasri Charan: హైస్కూల్ విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఏపీ మంత్రి ఉషశ్రీ... వీడియో ఇదిగో!

AP Minister Ushasri Charan turns into teacher

  • అనంతపురం జిల్లాలో ఉషశ్రీ చరణ్ పర్యటన
  • కల్యాణదుర్గంలో ఓ స్కూల్లో ఆకస్మిక తనిఖీ
  • 6వ తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగిన వైనం

ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పంతులమ్మ అవతారం ఎత్తారు. మంత్రి నేడు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ హైస్కూలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైస్కూలులో రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. 

అంతేకాదు, 6వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. మంత్రి బోధన ఆంగ్ల మీడియంలో సాగింది. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి, వారి నుంచి సమాధానాలు రాబట్టారు. అనంతరం విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పి క్లాసు నుంచి నిష్క్రమించారు. 

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను మంత్రి ఉషశ్రీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు.

Ushasri Charan
Minister
Teacher
School
Kalyandurgam
Anantapur District
YSRCP
Andhra Pradesh

More Telugu News