Anu Emmanuel: అల్లు శిరీష్ తో డేటింగ్ చేస్తున్నాననే వార్తలు విని.. మా అమ్మ చాలా బాధపడింది: అను ఇమ్మాన్యుయేల్
- 'ఊర్వశివో రాక్షసివో' చిత్రంలో నటించిన శిరీష్, అను
- నటీనటులపై ఇలాంటి వార్తలు రావడం కామన్ అన్న అను
- ఇలాంటి వార్తలను పట్టించుకోనని వ్యాఖ్య
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన 'ఊర్వశివో రాక్షసివో' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ రొమాంటిక్ సీన్లను పండించారు. ప్రేమ, డేటింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరోవైపు, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లు విడుదలైనప్పటి నుంచి వీరి గురించి ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలపై అను స్పందిస్తూ... నటీనటులపై ఇలాంటి వార్తలు రావడంలో ఆశ్చర్యం లేదని చెప్పింది. ఇలాంటి అసత్యపు వార్తలను తాను పట్టించుకోబోనని తెలిపింది. అయితే, ఈ వార్తలను విని తన తల్లి ఎంతో బాధపడిందని చెప్పింది. మరోవైపు, ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత శిరీష్, అనుల ఖాతాలో ఒక హిట్ పడింది. ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించారు.