Omlet: మందుబాబు ప్రాణం తీసిన ఆమ్లెట్

Man died after omlet stuck in throat

  • జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఘటన
  • మందు తాగుతూ ఆమ్లెట్ తింటుండగా విషాదం
  • గొంతులో ఆమ్లెట్ ఇరుక్కుని వ్యక్తి మృతి

ఆమ్లెట్ ఒక మందుబాబు ప్రాణం తీసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ ఘటన నిన్న జరిగింది. బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఈదులకంటి భూపాల్ రెడ్డి అనే 38 ఏళ్ల వ్యక్తి స్థానిక మద్యం దుకాణంలోని పర్మిట్ రూమ్ లో మద్యం తాగుతూ... ఆమ్లెట్ ను స్టఫ్ గా తీసుకుంటున్నాడు. అయితే, పొరపాటున ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడక ఇబ్బందిపడ్డాడు. పక్కనున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు.

Omlet
Man
Dead
Janagam district
  • Loading...

More Telugu News