Ashok Selvan: ఒక్క రోజులో షూట్ చేసిన ఆ పాట ఈ సినిమాలో హైలైట్: శివాత్మిక రాజశేఖర్

Akasham movie team interview

  • విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా 'ఆకాశం'
  • మీనాక్షి పాత్రలో కనిపించనున్న శివాత్మిక 
  • ఇతర పాత్రల్లో రీతూ వర్మ ... అపర్ణ బాలమురళి 
  • ఈ నెల 4వ తేదీన సినిమా విడుదల  

ఒక విభిన్నమైన ప్రేమకథాంశంతో 'ఆకాశం' సినిమా రూపొందింది. అశోక్ సెల్వన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా రీతూ వర్మ .. అపర్ణ బాలమురళి .. శివాత్మిక రాజశేఖర్ కనిపించనున్నారు. ఈ ముగ్గురు నాయికలతో ఆయన చేసే జర్నీయే ఈ సినిమా. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 4వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. 

తాజా ఇంటర్వ్యూలో అశోక్ సెల్వన్ .. రీతూ వర్మ .. శివాత్మిక పాల్గొన్నారు. "జీవితం ఆకాశమంత .. ఆకాశమంత పరచుకున్న ప్రేమనే ఈ కథ. ఈ సినిమాలో నా పాత్ర పేరు మీనాక్షి. హీరో కాంబినేషన్ లో నా పాట ఒకటి ఉంటుంది. 'ఊపిరే హాయిగా పాడెనే పదాలుగా' అంటూ సాగే ఈ పాట ..  నా ఫేవరేట్ సాంగ్" అంది. ఈ పాటను వన్ డే లో షూట్ చేయడం జరిగింది. అయినా ఈ సినిమాలో ఈ పాట హైలైట్ గా నిలుస్తుంది. చాలా అందంగా చిత్రీకరించిన ఈ పాట ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చింది. 

ఇక అశోక్ సెల్వన్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా లవ్ జర్నీ ముగ్గురుతో నడుస్తుంది. వీరా .. ప్రభు .. అర్జున్ అనే మూడు పేర్లతో కనిపిస్తాను. ఇలా డిఫరెంట్ లుక్స్ తో చేయడం కొత్తగా అనిపించింది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. తెలుగు హీరోగా భావించి నన్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Ashok Selvan
Shivathmika
Ritu Varma
Aparna Balamurali
  • Loading...

More Telugu News