Rahul Gandhi: పోతురాజు ఆటతో ఆకట్టుకున్న రాహుల్ గాంధీ

rahul gandhi incarnated as poturaju

  • సంగారెడ్డిలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
  • ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ కు ఘన స్వాగతం
  • పోతురాజుల కొరడాతో సందడి చేసిన రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో తొమ్మిదో రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో రాహుల్ పాద యాత్ర చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి నిన్న యాత్ర సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ కు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు వెంట వస్తుండగా రాహుల్ గాంధీ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ ఈ ఉదయం చాలా ఉత్సాహంగా కనిపించారు.

ఉదయం చిన్న పిల్లలతో కాసేపు కరాటే ఆడిన ఆయన.. తనకు స్వాగతం పలికిన గిరిజన నృత్యకారులతో కాలు కదిపారు. అలాగే, బోనాల ముంగిట పోతురాజుల విన్యాసం కూడా రాహుల్ చూశారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు, పోతురాజుల గురించి జగ్గారెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేతకు వివరించారు. జగ్గారెడ్డి పోతురాజు ఆట ఆడారు. ఎలా కొరడా ఝుళిపించాలో చెప్పారు. దాంతో రాహుల్ కూడా కొరడా తీసుకొని పోతురాజు ఆట ఆడారు. ఆయన కొరడా కొట్టుకోవడంతో ఆ ప్రాంతంలోని కార్యకర్తల అరుపులు, కేరింతలతో దద్దరిల్లింది.

Rahul Gandhi
bharath jodo
yatra
pothuraju
korada
sangareddy

More Telugu News