Adivi Sesh: 'హిట్ 2' మూవీ టీజర్ రిలీజ్

HIT movie teaser release

  • హీరో నాని నిర్మించిన 'హిట్ 2' మూవీ
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడివి శేష్
  • కథానాయికగా అలరించనున్న మీనాక్షి చౌదరి
  • డిసెంబర్ 2వ తేదీన సినిమా విడుదల  

ఇప్పుడు అడ్వెంచర్ తరహా కథలకు .. స్పై థ్రిల్లర్ తరహా కథలకు అడివి శేష్ పేరు కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తోంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'హిట్ 2' రెడీ అవుతోంది. గతంలో విష్వక్సేన్ హీరోగా 'హిట్' సినిమాను నిర్మించిన నాని, ఆ సిరీస్ లో భాగంగా 'హిట్ 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. జాన్ స్టీవర్ట్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ను బట్టి చూస్తే, పోలీస్ ఆఫీసర్ గా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ లో అడివి శేష్ కనిపిస్తున్నాడు. ఎవరు ఎంతగా కంగారు పడుతున్నా, కూల్ గా తాను చేయదలచుకున్న పనిని చేసే పాత్రలో అడివి శేష్ కొత్తగా అనిపిస్తున్నాడు.

ఒక యువతి మర్డర్ కేసును పోలీస్ ఆఫీసర్ గా అడివి శేష్ ఎలా ఛేదించాడు అనేదే కథ. సరిగ్గా ఆ పాయింటు పైనే టీజర్ ను కట్ చేశారు. అడివి శేష్ జోడీగా మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమాలో, రావు రమేశ్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. అడివి శేష్ పైఅధికారిగా ఆయన కనిపిస్తున్నాడు.  డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

Adivi Sesh
Meenakshi Choudary
Rao Ramesh
HIT Movie

More Telugu News