Mahesh Babu: మహేశ్ .. త్రివిక్రమ్ ప్రాజెక్టుపై హల్ చల్ చేస్తున్న రూమర్!

Mahesh and Trivikram movie update

  • మహేశ్ 28వ సినిమా దర్శకుడిగా త్రివిక్రమ్ 
  • కంటెంట్ విషయంలో మహేశ్ అసంతృప్తి అంటూ టాక్
  • బౌండ్ స్క్రిప్ట్ చూశాకే సెట్స్ పైకి వస్తానని చెప్పినట్టుగా ప్రచారం 
  • అవసరమైతే ముందుగా రాజమౌళి ప్రాజెక్టు చేసే ఆలోచన  

మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లనున్నారనే వార్త మహేశ్ అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఈ కాంబినేషన్ అనుకున్న తరువాత చాలా ఆలస్యంగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఓ పది రోజుల పాటు షూటింగు జరిపారు. ఆ తరువాత షెడ్యూల్ కి సంబంధించిన హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. 

ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగు లేనట్టే అనేది బయట వినిపిస్తున్న మాట. కథ విషయంలో మహేశ్ బాబుకి రావలసిన క్లారిటీ రాకపోవడం వలన .. పాన్ ఇండియా స్థాయి కంటెంట్ లేకపోవడం వలన మహేశ్ 'ప్రస్తుతానికి ఆపేద్దాం' అని చెప్పినట్టుగా ఒక రూమర్ షికారు చేస్తోంది. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతనే సెట్స్ పైకి వెళదామని ఆయన త్రివిక్రమ్ కి చెప్పినట్టుగా టాక్. 

త్రివిక్రమ్ ఒక వైపున సొంత బ్యానర్లో వచ్చే సినిమాల పైన దృష్టి పెట్టడం .. మరో వైపున కొన్ని సినిమాలకి కథలను ఇస్తుండటం కారణంగా, అనుకున్న సమయానికి మహేశ్ మూవీకి సంబంధించిన బౌండ్ స్క్రిప్ రెడీ కాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్లానింగ్ తేడా రాకుండా చూసుకునే మహేశ్, ఈ ప్రాజెక్టు ఆలస్యమైతే రాజమౌళితో సెట్స్ పైకి వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.

More Telugu News