Naveen Chandra: 'తగ్గేదే లే' నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్!

Thaggedele lyrical song released

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'తగ్గేదేలే'
  • నవీన్ చంద్ర సరసన అనన్య రాజ్ - దివ్య 
  • సంగీత దర్శకుడిగా చరణ్ అర్జున్ 
  • ఈ నెల 4వ తేదీన సినిమా విడుదల

నవీన్ చంద్ర హీరోగా 'తగ్గేదే లే' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శ్రీనివాసరాజు దర్శకుడిగా వ్యవహరించాడు. గతంలో ఆయన నుంచి వచ్చిన 'దండుపాళ్యం' సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే సిరీస్ లో ఆయన చేసిన సినిమానే 'తగ్గేదే లే'. 

దండుపాళ్యం బ్యాచ్ .. లవర్స్ ను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథ. లవర్స్ గా నవీన్ చంద్ర .. అనన్య రాజ్ .. దివ్య పిళ్లై కనిపించనున్నారు. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతాన్ని సమకూర్చాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'ఇదే ఇదేనే ఇదే ఇదేనే నేనెదురు చూసినది ఇదే ఇదేనే' అంటూ ఈ పాట సాగుతోంది. 

 యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఈ రొమాంటిక్ సాంగును చిత్రీకరించారు. చరణ్ అర్జున్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను హరిచరణ్ - మనీషా ఆలపించారు. మకరంద్ దేశ్ పాండే ..  పూజా గాంధీ .. నాగబాబు ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 4వ తేదీన థియేటర్లకు రానుంది.

Naveen Chandra
Ananya Raj
Divya Pillai
Thaggedele Movie

More Telugu News