Buggana Rajendranath: యనమలకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియడంలేదు: మంత్రి బుగ్గన

Buggana take a swipe at Yanamala

  • యనమల తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి 
  • టీడీపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పులు చేసిందని ఆరోపణ
  • తాము బకాయిలు చెల్లించామని వివరణ

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుపై రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. యనమలకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియట్లేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజానిజాలు తెలియకే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 

చరిత్రలో మరే ప్రభుత్వం చేయనంతగా టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని బుగ్గన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారని, బకాయి పెట్టిన పంట రుణాలు రూ.774 కోట్లు వైసీపీ ప్రభుత్వమే చెల్లించిందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అప్పులు పెరిగింది 15 శాతమేనని వివరించారు. 

ఆరోగ్యశ్రీలో లేని చికిత్సలకు సీఎం సహాయ నిధి నుంచి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క పాఠశాలను కూడా తొలగించలేదని బుగ్గన స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్టు వెల్లడించారు.

Buggana Rajendranath
Yanamala
Finance
YSRCP
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News