Challa Bhagiratha Reddy: వైసీపీలో తీవ్ర విషాదం.... ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత

MLC Challa Bhagiratha Reddy passes away

  • కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భగీరథ రెడ్డి
  • హైదరాబాదు ఆసుపత్రిలో చికిత్స
  • వెంటిలేటర్ అమర్చిన వైద్యులు
  • ఫలించని వైద్యుల ప్రయత్నాలు

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భగీరథ రెడ్డి హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వెంటిలేటర్ పై వైద్యులు అందించిన చికిత్స ఫలించలేదు. చల్లా భగీరథ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 46 ఏళ్ల వయసుకే ఆయన ఈ లోకాన్ని విడవడం పట్ల వైసీపీ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. భగీరథ రెడ్డి అంత్యక్రియలు రేపు (నవంబరు 3) కర్నూలు జిల్లా అవుకులో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 

చల్లా భగీరథ రెడ్డి దివంగత వైసీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు. ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో ఆయన కుమారుడు భగీరథ రెడ్డికి సీఎం జగన్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. భగీరథ రెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2019లో తండ్రితో కలిసి వైసీపీలో చేరారు.

Challa Bhagiratha Reddy
Demise
MLC
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News