Bollywood: ఫ్యాన్స్​ కు షారుఖ్ పుట్టిన రోజు కానుక.. అదిరిపోయిన ‘పఠాన్’​ చిత్రం టీజర్

shahrukh khan Pathaan teaser out

  • ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా షారుఖ్ కొత్త చిత్రం
  • హీరోయన్ గా దీపకా పదుకొణే 
  • జనవరి 25న విడుదల అవనున్న సినిమా

తన పుట్టిన రోజు నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అభిమానులకు కానుక ఇచ్చాడు. తన తదుపరి చిత్రం ‘పఠాన్’ టీజర్ ను చిత్రం బృందం ఈ ఉదయం విడుదల చేసింది. కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్న షారుఖ్ ‘పఠాన్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. టీజర్ చూస్తుంటే షారుఖ్ ఖాతాలో మంచి విజయం చేరుతుందనిపిస్తోంది. హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో షారుఖ్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ‘ఏం తెలుసు నీకు పఠాన్ గురించి’ అంటూ ఓ అధికారి మహిళను ప్రశ్నించడంతో టీజర్ మొదలైంది.

శత్రువుల చేతిలో బందీ అయిన పఠాన్ మూడేళ్లుగా చిత్రహింసలు అనుభవించడంతో పఠాన్ చనిపోయాడా? లేదా? అని బ్యాక్ గ్రౌండ్ లో మాటలు వినిపిస్తుండగా.. బ్రతికే ఉన్నాడు అంటూ షారుఖ్ నవ్వుతూ ఫైట్ చేయడంతో అతని పాత్ర రివీల్ అయింది. విలన్ పాత్రలో నటిస్తున్న జాన్ అబ్రహం, షారుఖ్ మధ్య భారీ ఫైట్లు చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయి. హీరోయిన్ దీపిక పదుకొణే తన అందాలతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించింది. ఈ చిత్రం వచ్చే జనవరి 25న విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్ లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.

Bollywood
Shahrukh Khan
pathaan
teaser
Deepika Padukone
movie

More Telugu News