redme: సగం ధరకే రెడ్ మీ స్మార్ట్ ఫోన్స్.. ఎక్కడంటే..!

Mi clearance sale 2022 Get THESE Redmi phones at half price
  • క్లియరెన్స్ సేల్ నిర్వహిస్తున్న ఎంఐ కంపెనీ
  • రూ. 3999కే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అందుబాటులో
  • క్లియరెన్స్ సేల్ లో కొన్న వాటికీ వ్యారంటీ ఇవ్వని ఎంఐ
మనదేశంలో స్మార్ట్ ఫోన్ కొనాలంటే కనీసం రూ. 5000 పైనే వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, రూ. 3999కే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లభించనుంది. అది కూడా రెడ్ మీ వంటి నాణ్యమైన బ్రాండ్ కి చెందిన ఫోన్. రెడ్ మీ మాతృసంస్థ ఎంఐ క్లియరెన్స్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రూ. 3,999కే స్మార్ట్‌ ఫోన్‌ లను అందుబాటులో ఉంచింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎంఐ క్లియరెన్స్ సేల్ అందుబాటులోకి తెచ్చింది. రెడ్ మీ 6ఏ, రెడ్ మీ వై3, రెడ్ మీ నోట్ 7 ప్రో. వంటి మోడల్స్ ను సగానికంటే తక్కువ ధరకు అమ్మకానికి పెట్టింది. 

బడ్జెట్ ఫోన్ అయిన రెడ్ మీ 6ఏ మోడల్ ను ప్రస్తుతం అత్యంత తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఆ బ్రాండ్ ప్రారంభ ధర రూ.6,999 కాగా.. క్లియరెన్స్ సేల్ లో దీన్ని రూ. 3,999కి అందుబాటులో ఉంచింది. రెడ్ మీ 6ఏ అనేది చాలా ప్రాథమిక ఫీచర్లతో కూడిన ఎంట్రీ-లెవల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ ఉంటుంది. మిగతా మోడళ్లను కూడా తక్కువ ధరకే ఎంఐ అమ్మకానికి పెట్టింది. అయితే, క్లియరెన్స్ సేల్ లో డిస్కౌంట్ ధరలకు విక్రయిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ లకు ఎలాంటి వారంటీ ఉండదు. క్లియరెన్స్ సేల్ లో ఫోన్లు కొనాలనుకునే వాళ్లు ఎంపై అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
redme
smartphones
mi
clearance sale
half prize

More Telugu News