Raj Tarun: జీ 5 నుంచి మరో తెలుగు వెబ్ సిరీస్ .. 'అహ నా పెళ్లంట'

Aha na Pellanta Web Series

  • రొమాంటిక్ కామెడీగా రూపొందిన 'అహ నా పెళ్లంట' 
  • రాజ్ తరుణ్ జోడిగా శివాని రాజశేఖర్ 
  • 8 ఎపిసోడ్స్ గా పలకరించనున్న కథ 
  • ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్  

ప్రేమకథలకు యూత్ నుంచి మంచి ఆధరణ లభిస్తుంది. ఆ ప్రేమ పెద్దల అనుమతి పొందడానికి ప్రయత్నిస్తే, వెంటనే అది ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా మారిపోతుంది. ఇలాటి కథకి కాస్త కామెడీ తోడైతే ఆ కథ అన్ని తరగతుల ప్రేక్షకులను అలరిస్తుంది. అలాంటి ఒక కంటెంట్ తో రూపొందిన వెబ్ సిరీస్ పేరే 'అహ నా పెళ్లంట'. ఇది పెళ్లి అనే క్లిష్టమైన అంశం చుట్టూ తిరిగే ప్రేమకథ అనే విషయం టైటిల్ ను బట్టే తెలిసిపోతోంది. 
 
 జీ 5వారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించగా .. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నవంబర్ 17వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో నడిచే ఈ కథ 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులను పలకరించనుంది. 

రాజ్ తరుణ్ - శివాని రాజశేఖర్ జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్ లో నరేశ్ .. ఆమని కీలకమైన పాత్రలను పోషించారు. ఇతర ముఖ్యమైన పాత్రలలో పోసాని .. హార్షవర్ధన్ కనిపించనున్నారు. తన లైఫ్ లోకి ఏ అమ్మాయైనా అడుగుపెడితే ఏదో చెడు జరుగుతుందనే ఆలోచనతో పెరిగిన ఒక యువకుడి చుట్టూ తిరిగే కథగా ఇది కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావాల్సినంత ఉందనే అనిపిస్తోంది మరి

Raj Tarun
Shivani
Amani
Naresh
Posani

More Telugu News