Samantha: 'మీ స్వయంవరంలో ఏ హీరోలు పాల్గొనాలనుకుంటారు?' అనే ప్రశ్నకి, వరలక్ష్మి శరత్ కుమార్ రియాక్షన్!

varalakshmi Sarath Kumar Interview

  • కోలీవుడ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ బిజీ 
  • తెలుగులోనూ పెరుగుతున్న క్రేజ్ 
  • తాజా చిత్రంగా 4వ తేదీన రానున్న 'యశోద'
  • 'పొన్నియిన్ సెల్వన్' లో ఛాన్స్ రానందుకు బాధగా ఉందన్న వరలక్ష్మి 

కోలీవుడ్ లో లేడీ విలన్ రోల్స్ ప్రస్తావన రాగానే వెంటనే వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తావన వస్తుంది. 'క్రాక్' .. 'నాంది' సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. తాజాగా సమంత చేసిన 'యశోద' సినిమాలోనూ వరలక్ష్మి ఒక కీలకమైన పాత్రను చేశారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షలకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె పాల్గొంటూ వెళుతున్నారు. 

తాజా ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ ఉండగా ఆమె పెళ్లి ప్రస్తావన వచ్చింది. "ఒకవేళ మీకు స్వయంవరం ప్రకటిస్తే, అందులో ఏ హీరోలు పాల్గొనాలని అనుకుంటారు?" అనే ప్రశ్న ఎదురైంది. అందుకు వరలక్ష్మి స్పందిస్తూ .. "అలాంటి ఆలోచన ఏదీ లేదు. నాకు తగినవాడు తారసపడినప్పుడు పెళ్లి సంగతి అప్పుడు ఆలోచిస్తాను. ప్రస్తుతం నా దృష్టి అంతా కూడా నా కెరియర్ పైనే పెట్టాను" అన్నారు. 

"ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు నా వాయిస్ బాగోలేదని అవమానించారు. నా వాయిస్ సినిమాలకి పనికిరాదని చెప్పారు. కానీ ఆ తరువాత నా వాయిస్ నా ఎదుగుదల విషయంలో ముఖ్యమైన పాత్రను పోషించింది. నా వాయిస్ బాగుంటుందనే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. సాధారణంగా నేను ఏ సినిమా చూసినా అందులో నేను లేనే అనుకోను. కానీ 'పొన్నియిన్ సెల్వన్' చూసినప్పుడు, అందులో చేసే ఛాన్స్ రానందుకు చాలా బాధపడ్డాను" అంటూ చెప్పుకొచ్చారు.

Samantha
Varalakshmi Sharath Kumar
Yashoda Movie
  • Loading...

More Telugu News