Canada: నిపుణులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్న కెనడా
- కార్మికులు, నిపుణుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కెనడా
- 2025 నాటికి ఏటా 5 లక్షల మంది రావచ్చని అంచనా
- గతేడాది 4 లక్షల మందికి శాశ్వత నివాస హోదా
నిపుణులు, కార్మికుల కొరతను కెనడా పెద్ద ఎత్తున ఎదుర్కొంటోంది. 2025 నాటికి ఏటా 5 లక్షల మంది తమ దేశానికి వలస రావచ్చన్న ప్రణాళికతో ఉంది. వలసదారుల వ్యవహారాల మంత్రి సియాన్ ఫ్రేజర్ ఇందుకు సంబంధించి నూతన ప్రణాళికను విడుదల చేశారు. తగినంత అనుభవం, నైపుణ్యాలు ఉన్న వారికి శాశ్వత నివాస హోదా ఇవ్వనుంది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ సైతం ఈ ప్రణాళికను స్వాగతించింది.
దీన్ని అతిపెద్ద వలసవాదంగా కెనడా మంత్రి ఫ్రేజర్ వ్యాఖ్యానించారు. 2023లో వివిధ దేశాల నుంచి 4,65,000 మంది వస్తారని, 2025 నాటికి ఇలా వచ్చే వారి సంఖ్య 5,00,000కు చేరుకుంటుందని కెనడా అంచనా వేస్తోంది. గతేడాది 4,05,000 మందికి కెనడా శాశ్వత నివాస హోదా ఇచ్చింది.