Sensex: వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 375 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 133 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5 శాతం పెరిగిన ఎన్టీపీసీ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు కూడా ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. ట్రేడింగ్ ముగిసేంత వరకు మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో పాటు... విదేశీ పెట్టుబడులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 61,121కి చేరుకుంది. నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 18,145 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (5.00%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.07%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.39%), ఇన్ఫోసిన్ (2.27%), టీసీఎస్ (2.08%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-3.76%), మారుతి (-0.94%), రిలయన్స్ (-0.78%), టాటా స్టీల్ (-0.34%).