England: న్యూజిలాండ్ కు 180 రన్స్ టార్గెట్ నిర్దేశించిన ఇంగ్లండ్

England set New Zealand 180 runs target

  • బ్రిస్బేన్ లో గ్రూప్-1 మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 రన్స్
  • బట్లర్, హేల్స్ అర్ధసెంచరీలు
  • ఫెర్గుసన్ కు 2 వికెట్లు

న్యూజిలాండ్ తో టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచ్ లో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అర్ధసెంచరీలతో రాణించిన వేళ... ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. 

కెప్టెన్ బట్లర్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 73 పరుగులు చేయగా, హేల్స్ 40 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత లియామ్ లివింగ్ స్టోన్ ఒక్కడే ఫరవాలేదనిపించాడు. లివింగ్ స్టోన్ 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు.

మొయిన్ అలీ (5), బెన్ స్టోక్స్ (8), హ్యారీ బ్రూక్ (7) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 2, టిమ్ సౌథీ 1, మిచెల్ శాంట్నర్ 1, ఇష్ సోధీ 1 వికెట్ తీశారు.

England
New Zealand
Brisbane
Group-1
Super-12
T20 World Cup
  • Loading...

More Telugu News