Telangana: ఆర్టీసీ బస్సు టాప్ పైకి ఎక్కి ప్రసంగించిన రాహుల్ గాంధీ... వీడియో ఇదిగో

rahul gandhi get on top of rtc bus in his yatra

  • తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో సాగుతున్న రాహుల్ యాత్ర
  • ఆర్టీసీ కార్మికులతో మాట్లాడే క్రమంలో బస్సు టాప్ ఎక్కిన కాంగ్రెస్ నేత
  • రాహుల్ కంటే ముందుగానే బస్సు టాప్ ఎక్కిన రేవంత్ రెడ్డి
  • నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ శ్రేణులు

భారత్ జోడో యాత్రలో ఎన్నడూ లేనంత హుషారుగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ...తెలంగాణలోకి యాత్ర ప్రవేశించాక మరింతగా దూకుడు పెంచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివారం చిన్నారులతో కలిసి పరుగు పందెం ఆడిన రాహుల్ గాంధీ... తాజాగా సోమవారం అదే జిల్లా పరిధిలో ఏకంగా ఆర్టీసీ బస్సు టాప్ పైకి ఎక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 

సోమవారం నాటి యాత్ర ముగింపు సమయంలో ఆర్టీసీ కార్మికులతో రాహుల్ గాంధీ మాట్లాడేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. ఈ భేటీని కాస్తంత డిఫరెంట్ గా నిర్వహిద్దామన్న భావనతో ఆర్టీసీ బస్సు టాప్ ను వేదికగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో అప్పటికే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లను బస్సు టాప్ పైకి ఎక్కించిన రేవంత్... ఆ తర్వాత తాను కూడా టాప్ ఎక్కారు. తన వెనకాలే రాహుల్ గాంధీని ఆయన బస్సు టాప్ పైకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీ బస్సు టాప్ పైకి ఎక్కగానే... దేశ్ కీ నేత... రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులతో రాహుల్ గాంధీ మాట్లాడారు.

Telangana
Congress
Rahul Gandhi
Bharat Jodo Yatra
Revanth Reddy
TPCC President

More Telugu News