Subramanian Swamy: ఓ హరేన్ పాండ్యలా నన్ను కూడా...! మోదీ, అమిత్ షాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి

Subramanian Swamy cryptic tweet on Modi and Shah

  • ట్విట్టర్లో స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి
  • గతంలో హత్యకు గురైన హరేన్ పాండ్యా
  • మోదీ, షా పేర్లు ప్రస్తావించిన సుబ్రహ్మణ్యస్వామి
  • వైరల్ అవుతున్న ట్వీట్

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్యోదాంతాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు. 

"హరేన్ పాండ్యా వ్యవహారంలో చేసినట్టుగా మోదీ, షా నాపై కుట్ర చేయబోరని భావిస్తున్నా. వాళ్లిద్దరూ ఆర్ఎస్ఎస్ అధినాయకత్వంలోని పెద్దల పట్ల కూడా దాష్టీకం చలాయించారు. గుర్తుంచుకోండి... మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉంటా. ఒకవేళ ఏదన్నా జరిగితే నా స్నేహితులను అప్రమత్తం చేయాల్సి ఉంటుంది" అంటూ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. 

2003లో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా అహ్మదాబాద్ లో హత్యకు గురయ్యారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆయన కారులో కూర్చుని ఉండగా, ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఐదు బుల్లెట్లు తాకడంతో ఆయన కారులోనే ప్రాణాలు విడిచారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన మృతదేహం కారులోనే ఉంది. ఆయన ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన సహాయకుడ్ని పంపించగా, పాండ్యా హత్యకు గురైన విషయం వెల్లడైంది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందన్న ప్రచారం జరిగింది.

More Telugu News