Naveenchandra: 'తగ్గేదే లే' ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే .. ఎక్కడంటే .. !

Thaggedele Pre release event

  • 'దండుపాళ్యం' బ్యాచ్ తో 'తగ్గేదే లే'
  • ప్రధానమైన పాత్రలో నవీన్ చంద్ర 
  • కీలకమైన పాత్రల్లో మకరంద్ దేశ్ పాండే - పూజా గాంధీ 
  • నవంబర్ 4వ తేదీన సినిమా రిలీజ్

'దండుపాళ్యం' సిరీస్ ఒక వర్గం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతూ వచ్చింది. 'దండుపాళ్యం' బ్యాచ్ ఆగడాలతో .. హత్యలతో ఈ కథలు ఆకట్టుకుంటూ వచ్చాయి. తాజాగా ఇదే సిరీస్ లో మరో సినిమాను చేశారు. ఈ సారి ఈ సినిమాకి 'తగ్గేదే లే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. శ్రీనివాసరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను, నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ ఊపందుకున్నాయి. ఈ సినిమా నుంచి చకచకా పోస్టర్స్ ను వదులుతూ వెళుతున్నారు. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు ప్లాన్ చేశారు. హైదరాబాదు - దసపల్లా కన్వెన్షన్ లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. 

భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో నవీన్ చంద్ర .. మకరంద్ దేశ్ పాండే .. పూజా గాంధీ .. రవిశంకర్ తదితరులు నటించారు. నవంబర్ 4వ తేదీన దాదాపు అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెద్ద సినిమాలేవీ లేకపోయినా ఉన్న సినిమాల మధ్య పోటీ గట్టిగానే ఉంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.

More Telugu News