Kishan Reddy: వేరే పార్టీలో గెలిచిన వారిని మీ పార్టీలో చేర్చుకోలేదా?: కేసీఆర్ ను ప్రశ్నించిన కిషన్ రెడ్డి

Kishan Reddy slams CM KCR

  • చండూరులో సీఎం కేసీఆర్ ప్రసంగం
  • బీజేపీపై విమర్శనాస్త్రాలు
  • స్పందించిన కిషన్ రెడ్డి
  • కేసీఆర్ లో అభద్రతాభావం కనిపించిందని వెల్లడి

చండూరులో సీఎం కేసీఆర్ ప్రసంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తే అభద్రతాభావం, అపనమ్మకం కనిపించిందని అన్నారు. పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారని వ్యాఖ్యానించారు.

చండూరులోనూ కేసీఆర్ పాత రికార్డునే ప్లే చేశారని విమర్శించారు. ఆరోపణలు, హామీలకు సంబంధించి కేసీఆర్ మాట్లాడినవన్నీ అవాస్తవాలేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని మీ పార్టీలో చేర్చుకున్నారు అని ఆరోపించారు. ఫిరాయింపుదారులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారో వామపక్షాలు పరిశీలించుకోవాలని హితవు పలికారు. 

ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారంపై కిషన్ రెడ్డి స్పందిస్తూ... నలుగురు హీరోలని కేసీఆర్ చెబుతున్న నేతలు పార్టీ ఫిరాయించినవారేనని వెల్లడించారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో డబ్బు విషయం ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు.

Kishan Reddy
KCR
BJP
TRS
Munugode
  • Loading...

More Telugu News