Poonam Kaur: నేను జారిపడబోతే రాహుల్ గాంధీ నా చేయి పట్టుకున్నారు: పూనమ్ కౌర్

Poonam Kaur reacts to Priti Gandhi comment

  • భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ 
  • తెలంగాణలో ప్రవేశించిన పాదయాత్ర
  • మహబూబ్ నగర్ జిల్లాలో యాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్
  • రాహుల్ తో పూనమ్ ఫొటో వైరల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతుండగా, ఈ యాత్రలో టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో రాహుల్ గాంధీ... పూనమ్ కౌర్ చేయి పట్టుకుని నడవడం వైరల్ అయింది. దీనిపై బీజేపీ నేత ప్రీతి గాంధీ స్పందిస్తూ... ముత్తాత అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఈ వ్యాఖ్యలపై పూనమ్ కౌర్ స్పందించారు. ఇది చాలా అవమానకరం అని పేర్కొన్నారు. నేను జారిపడబోతే రాహుల్ గాంధీ నా చేయి పట్టుకున్నారు అని స్పష్టం చేశారు. అటు, ప్రీతి గాంధీ ట్వీట్ పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మోదీ మహిళలతో ఉన్న ఫొటోలను పోస్టు చేసి ప్రీతికి కౌంటర్ ఇచ్చారు.

Poonam Kaur
Rahul Gandhi
Bharat Jodo
Congress
Telangana
  • Loading...

More Telugu News