Namitha: తిరుమల కొండపై నమిత సందడి

Namitha visits Tirumala with her family

  • కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం
  • స్వామివారికి మొక్కు తీర్చుకునేందుకు వచ్చామని వెల్లడి
  • తన పిల్లల ఆరోగ్యం ఇప్పుడు బాగుందని వివరణ
  • రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నానని వ్యాఖ్యలు

ప్రముఖ నటి నమిత తిరుమల విచ్చేశారు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి నేడు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయంలో లడ్డూ ప్రసాదం స్వీకరించారు. అనంతరం ఆలయం వెలుపల నమిత మీడియాతో మాట్లాడారు. 

తన పిల్లల ఆరోగ్యం ఇప్పుడు బాగుందని, స్వామి వారి మొక్కు తీర్చుకునేందుకు వచ్చామని వెల్లడించారు. తన కుటుంబం క్షేమంగా ఉండడం పట్ల స్వామివారికి కృతజ్ఞతలు చెప్పేందుకే తిరుమల వచ్చామని తెలిపారు. అంతేకాదు, ప్రస్తుతం తాను సినిమాల కంటే రాజకీయాలపై మరింత ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. నమిత 2019లో బీజేపీలో చేరారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు.

Namitha
Tirumala
Temple
Family
Politics
BJP
  • Loading...

More Telugu News