: ఒక్క రోజాగండి.. కొత్త న్యూస్ వింటారు: బీసీసీఐ డిప్యూటీ చీఫ్ జైట్లీ
స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ పీఠానికి ఎసరు తెచ్చింది. శ్రీనివాసన్ మేనల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓగా ఉన్న మేయప్పన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజీనామా చేసేది లేదంటూ శ్రీనివాసన్ కరాఖండిగా చెబుతూ వస్తున్నారు. కానీ, బీసీసీఐ సభ్యుల నుంచి రాజీనామాకు ఒత్తిడి పెరుగుతూనే ఉంది. దీనికితోడు శుక్రవారం బీసీసీఐ సెక్రటరీ, ట్రెజరర్ రాజీనామా చేశారు. దీంతో శ్రీనివాసన్ కాస్త బెట్టు దిగారు. దీనిపై చర్చించడానికి ఈ నెల 8న అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు అరుణ్ జైట్లీ కూడా ఒక రోజాగితే ఊహించనిది వింటారంటూ సస్పెన్స్ కు తెరలేపారు. దీంతో శ్రీనివాసన్ రాజీనామా చేయక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.