Laerence: అన్నా, వీళ్లందరినీ చంపింది రౌడీనో .. వేటగాడో కాదు: ఆసక్తి కలిగిస్తున్న 'రుద్రుడు' ఫస్టు గ్లింప్స్

Rudrudu first glimpes release

  • 'రుద్రుడు'గా కనిపించనున్న లారెన్స్ 
  • కథానాయికగా అలరించనున్న ప్రియా భవాని శంకర్ 
  • సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ 
  • వచ్చే ఏప్రిల్లో నాలుగు భాషల్లో సినిమా విడుదల

లారెన్స్ ఆ మధ్య వరుస సినిమాలతో తెలుగు .. తమిళ భాషల్లో విరుచుకుపడ్డాడు. 'కాంచన' .. 'గంగ' వంటి సినిమాలు ఆయనకి కాసుల వర్షం కురిపించాయి. ఆ తరువాత చేసిన 'శివలింగ' కూడా ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన మార్కు సినిమాలు రాలేదు. అలాంటి సినిమాల కోసమే అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

అలాంటి అభిమానుల కోసం ఆయన 'చంద్రముఖి 2' సినిమాలు చేస్తున్నాడు. అలాగే 'రుద్రుడు' అనే సినిమాను కూడా పట్టాలెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కథిరేసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి, లారెన్స్ బర్త్ డేను పురస్కరించుకుని కొంతసేపటిక్రితం ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు.

 యాక్షన్ సీన్ ప్రధానంగా సాగిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. లారెన్స్ జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏప్రిల్లో ఈ సినిమాలు విడుదల చేయనున్నారు.

More Telugu News