Balakrishna: యాడ్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకున్న బాలకృష్ణ

Balakrishna takes 15 Cr remuneration for Ad

  • తన చరిత్రలో తొలిసారి యాడ్ లో నటించిన బాలయ్య
  • రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడార్ గా బాలకృష్ణ
  • రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్
  • ఆ మొత్తం బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి విరాళం 

సినీ హీరోలు, హీరోయిన్లు కమర్షియల్ యాడ్స్ లో నటించడం సాధారణ విషయమే. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్నో యాడ్స్ చేశారు. కొందరు మాత్రం యాడ్స్ కు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో బాలకృష్ణ ఒకరు. ముందు నుంచి కూడా యాడ్స్ చేయకూడదనే నియమాన్ని బాలయ్య పెట్టుకున్నారు. 

అయితే, ఈ నియమాన్ని పక్కనపెట్టి... తొలిసారి ఆయన యాడ్ లో కనిపించారు. ఒక రియలెస్టేట్ కంపెనీ యాడ్ లో నటించారు. ఇది బాలయ్య చరిత్రలోనే తొలి యాడ్ కావడంతో.. ఆయనకు సదరు కంపెనీ భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ యాడ్ కు బాలయ్యకు ఏకంగా రూ. 15 కోట్లు చెల్లించినట్టు టాలీవుడ్ సర్కిల్ లో చర్చించుకుంటున్నారు. ఇది ఒక్కో సినిమాకు ఆయన తీసుకునే దాని కంటే ఎక్కువే. యాడ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆయన బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చినట్టు సమాచారం.

మరోవైపు సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం బాలయ్య 'వీరసింహారెడ్డి' అనే సినిమాలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కాబోతోంది.

Balakrishna
Tollywood
Ad
Remuneration
  • Loading...

More Telugu News