Allu Sirish: వచ్చే శుక్రవారం థియేటర్లలో దిగిపోనున్న అరడజను సినిమాలు ఇవే!

Next week six movies are releasing

  • అల్లు శిరీష్ హీరోగా వస్తున్న ఊర్వశివో రాక్షసివో'
  • మరో ప్రేమకథా చిత్రంగా రూపొందిన 'ఆకాశం'
  • రిలీజ్ కి రెడీ అయినా 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'
  • ఇదే తేదీని ఖరారు చేసుకున్న అల్లరి నరేశ్ సినిమా
  • లైన్లోనే ఉన్న 'తగ్గేదే లే' .. 'బనారస్'

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలన్నీ కలిసి ఒకే రోజున పొలోమంటూ థియేటర్లలో దిగిపోతున్నాయి. ఒక్కోసారి ఒకటి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, మరోసారి అరడజను సినిమాల వరకూ పోటెత్తుతున్నాయి. కంటెంట్ ఉంటే చాలు థియేటర్ల దగ్గర తమ సినిమా నిలబడుతుందనే నమ్మకంతో ఎవరికి వారు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళుతున్నారు. ఓటీటీ వైపు నుంచి ఉన్న నియమ నిబంధనలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. 

వచ్చే శుక్రవారం .. అంటే నవంబర్ 4వ తేదీన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా విడుదల కానుంది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా, రొమాంటిక్ లవ్ జోనర్లో ప్రేక్షకులను పలకరించనుంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కావడంతో, యూత్ లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఇక అదే రోజున 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' కూడా రిలీజ్ కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా ఫరియా అబ్దుల్లా సందడి చేయనుంది. 

 అల్లరి నరేశ్ హీరోగా ఎ.ఆర్.మోహన్ రూపొందించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ..  నవీన్ చంద్ర కథానాయకుడిగా కనిపించే 'తగ్గేదే లే' కూడా అదే రోజున విడుదల కానున్నాయి. ఇక 'ఆకాశం' సినిమాపై కూడా అంచనాలు కనిపిస్తున్నాయి. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీతూ వర్మ .. అపర్ణ బాలమురళి .. శివాత్మిక కథానాయికలుగా అలరించనున్నారు. తెలుగు అనువాదమైన కన్నడ సినిమాగా 'బనారస్' కూడా అదే రోజున రానుంది. ఈ అరడజను సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి..

Allu Sirish
Allari Naresh
Naveen Chandra
Santhosh Sobhan
  • Loading...

More Telugu News