Allu Sirish: ప్రతి ప్రేమికుడు నా పాత్రలో తనని తాను ఊహించుకుంటాడు: అల్లు శిరీష్

Allu Sirish Interview

  • అల్లు శిరీష్ హీరోగా రూపొందిన 'ఊర్వశివో రాక్షసివో'
  • కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ 
  • సంగీత దర్శకత్వం వహించిన అనూప్ రూబెన్స్ 
  • నవంబర్ 4వ తేదీలేన ఈ సినిమా రిలీజ్  

అల్లు శిరీష్ - అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మించిన ఈ సినిమాకి, రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. అలాంటి ఈ సినిమాను నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. 

తాజా ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో శ్రీకుమార్ పాత్రలో నేను .. సింధు పాత్రలో అనూ కనిపిస్తాము. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చే ప్రతి సీన్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అనూప్  రూబెన్స్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా తప్పకుండా మ్యుజికల్ హిట్ గా నిలబడుతుందనే నమ్మకం ఉంది. 

ముఖ్యంగా 'మాయారే' సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమ్మాయిలను శాపనార్థాలు పెట్టినట్టుగా అనిపించినా, దాని వెనుక ఒక గాయపడిన ప్రేమికుడి ఆవేదన కనిపిస్తుంది. ప్రతి ప్రేమికుడు నా పాత్రలో తనని తాను ఊహించుకుంటాడు. వెన్నెల కిశోర్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా యూత్ కి వెంటనే కనెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు" అంటూ చెప్పుకొచ్చాడు.

Allu Sirish
Anu Emmanuel
Vennela Kishore
Urvasivo Rakshasivo Movie
  • Loading...

More Telugu News