G Jagadish Reddy: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

CEC issues notice to Telangana minister Jagadish Reddy

  • ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారని ఆరోపణలు 
  • జగదీశ్ రెడ్డిపై సీఈసీకి లేఖ రాసిన బీజేపీ నేత కపిలవాయి
  • నివేదిక అందించాలని ఎస్ఈసీకి ఆదేశాలు
  • ఎస్ఈసీ నివేదిక ఆధారంగా మంత్రికి నోటీసులు

ఓటర్లను బెదిరింపులకు గురిచేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 

జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో, టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందవని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారని కపిలవాయి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సీఈసీకి లేఖ రాశారు. 

దీనిపై స్పందించిన సీఈసీ... జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై వాస్తవిక నివేదిక అందించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి నిర్దేశించింది. దీంతో జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై ఎస్ఈసీ సమగ్ర నివేదిక అందించారు. 

ఎస్ఈసీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని పేర్కొంది. రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాలని మంత్రి జగదీశ్ రెడ్డికి స్పష్టం చేసింది.

G Jagadish Reddy
CEC
Notice
Munugode
  • Loading...

More Telugu News