KA Paul: రైతు వేషంలో సైకిల్ తొక్కుతూ కేఏ పాల్ ఎన్నికల ప్రచారం... వీడియో ఇదిగో!

KA Paul cycling in campaign

  • నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నిక
  • పోటీ చేస్తున్న కేఏ పాల్
  • ముమ్మరంగా ప్రచారం
  • నేడు రైతు వేషం వేసిన వైనం
  • రైతులతో ముచ్చట్లు 

మునుగోడులో ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రచారంలో ఊపు పెంచారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రజలతో కలిసి డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా ముందుకెళుతున్నారు. 

ఇవాళ ఆయన రైతు వేషం వేశారు. కండువాను తలకు కట్టుకున్న ఆయన, బనియన్, పంచెతో దర్శనమిచ్చారు. అంతేకాదు, సైకిల్ తొక్కుతూ పొలంబాట పట్టారు. 

రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన మాటలు, హావభావాలతో రైతులను నవ్వించారు. రైతులతో కలిసి పత్తి ఏరారు. ఇవాళ కేఏ పాల్ ప్రచారం చండూరు పరిధిలో సాగింది. అటు, బనియన్, పంచె, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ తో వాహనం నుంచి కూడా ఆయన ప్రచారం చేశారు. 

దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. 

KA Paul
Cycle
Munugode
Farmers
Prajasanthi Party

More Telugu News