Kamal Haasan: 100 రోజుల ఫంక్షన్ కి రెడీ అవుతున్న 'విక్రమ్' .. వేదిక ఎక్కడంటే .. !

Vikram 100 days function on Navember 7th

  • 'విక్రమ్' గా వచ్చిన కమల్ 
  • ఎక్కువ మార్కులు కొట్టేసిన యాక్షన్ 
  • 100 రోజులను పూర్తి చేసుకున్న సినిమా 
  • నవంబర్ 7న 100 డేస్ ఫంక్షన్

కమలహాసన్ నుంచి వచ్చిన 'విక్రమ్' సంచలన విజయాన్ని సాధించింది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. కొంతకాలంగా తన సినిమాల విషయంలో అసంతృప్తితో ఉంటూ వచ్చిన కమల్ కి ఈ సినిమా ఎంతో ఊరటనిచ్చింది. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమా, 300 కోట్లకి పైగా వసూళ్లతో భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

కమల్ కెరియర్ లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచిన 'విక్రమ్' .. పలు సెంటర్స్ లో 100 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ 100 రోజుల ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేశారు. చెన్నై లోని 'కలైవనార్ అరంగం' ఇందుకు వేదిక కానుంది. నవంబర్ 7వ తేదీన ఈ వేడుకను జరపనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. 

సాధారణంగా కమల్ సినిమాల్లో రొమాన్స్ తప్పకుండా ఉంటుంది. అలాంటిది ఈ సినిమాలో హీరోయిన్ ఉండదనీ, కథ అంతా కూడా కమల్ .. విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ మధ్య జరుగుతుందనీ, సూర్య చివర్లో వస్తాడని తెలిసినప్పుడు, ఈ సినిమా కమల్ అభిమానుల అంచనాలను అందుకుంటుందా? అనుకున్నారు. కానీ ఈ సినిమా అంచనాలను మించిపోవడం విశేషం..

More Telugu News