Chandrababu: టీడీపీ ఇన్చార్జిలతో చంద్రబాబు సమావేశం... నారా లోకేశ్ తో ప్రత్యేక భేటీ

Chandrababu held meeting with Nara Lokesh

  • పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు సమీక్ష
  • మంగళగిరి, కుప్పం, కర్నూలు, ఇచ్ఛాపురం ఇన్చార్జిలతో భేటీ
  • దిశానిర్దేశం చేసిన టీడీపీ అధినేత

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నారు. వైసీపీని ఓడించితీరాలన్న కసితో ఉన్న చంద్రబాబు గత కొన్ని రోజులుగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేడు మంగళగిరి, కుప్పం, కర్నూలు, ఇచ్ఛాపురం నియోజకవర్గాల ఇన్చార్జిలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంపై నారా లోకేశ్ తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంగళగిరి నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్టును లోకేశ్ ను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధత, వ్యూహాలపై చర్చించారు. 

అటు, ఇతర నియోజకవర్గాల ఇన్చార్జిలకు కూడా గెలుపే పరమావధి అని ఉద్బోధించారు. ఇన్చార్జిలు ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమై వారి మనోభావాలను తెలుసుకున్నారు.

మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్నందున, పార్టీ కోసం కష్టపడాలని సూచించారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకునిపోవడంపై శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

Chandrababu
Nara Lokesh
Mangalagiri
TDP Incharge
  • Loading...

More Telugu News