Junior NTR: ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి నేను రెడీ: జాన్వీ కపూర్

Jhanvi Kapoor Interview

  • బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కి మంచి క్రేజ్ 
  • సౌత్ సినిమాల పట్ల ఆసక్తి ఉందంటూ మనసులో మాట 
  • ఎన్టీఆర్ పట్ల ప్రత్యేకమైన అభిమానం కనబరుస్తున్న బ్యూటీ 
  • ఆయనతో నటించే ఛాన్స్ వస్తే వదులుకోనని వెల్లడి

బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆమె నుంచి బ్లాక్ బస్టర్ సినిమాలేవీ లేకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అంతా తన గురించి మాట్లాడుకునేలా చేస్తుంటుంది. శ్రీదేవి కూతురుగా ఆమెను తెలుగు తెరకి పరిచయం చేయడానికి ఇక్కడి మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకూ అయితే ఆమెను ఎవరూ ఒప్పించలేకపోయారు. 

బోనీ కపూర్ ఈ మధ్య ఒక వేదికపై మాట్లాడుతూ, సౌత్ సినిమాలు చేయడానికి జాన్వీ ఆసక్తిని చూపిస్తోందని అన్నారు. ఇప్పుడు జాన్వీ కూడా అదే మాట చెబుతోంది. సౌత్ సినిమాలను తాను తప్పకుండా చూస్తుంటాననీ, ఈ మధ్య కాలంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' తనకి బాగా నచ్చిందని చెప్పింది. ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ అదరగొట్టేశారంటూ కితాబునిచ్చింది. 

టాలీవుడ్ విషయానికి వస్తే .. ప్రభాస్ .. మహేశ్ బాబు .. చరణ్ .. ఎన్టీఆర్ .. బన్నీ ఇలా అందరి యాక్టింగ్ తనకి నచ్చుతుందనీ, అయితే ఎన్టీఆర్ జోడీగా చేసే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోనంటూ ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రకటించింది. ఎలాగూ కొరటాల - ఎన్టీఆర్ సినిమాకి ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు గనుక, జాన్వీని సంప్రదిస్తే వర్కౌట్ అయ్యేలానే అనిపిస్తోంది. ఎన్టీఆర్ సరసన జాన్వీ అంటే, ప్రాజెక్టు పై క్రేజ్ పెరగడం అక్కడి నుంచి మొదలైనట్టే.

Junior NTR
Jhanvi Kapoor
Koratala Siva

More Telugu News