Ashiok Selvan: సాయిపల్లవి చేతుల మీదుగా 'ఆకాశం' సాంగ్ రిలీజ్!

Aakasam Song released

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'ఆకాశం'
  • హీరోగా అశోక్ సెల్వన్ పరిచయం
  • ఆకట్టుకునే ట్యూన్ ను అందించిన గోపీసుందర్
  • అందంగా సాగిన అర్థవంతమైన సాహిత్యం   
  • ఈ నెల 4వ తేదీన సినిమా విడుదల

విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను పలకరించడానికి 'ఆకాశం' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాతో తెలుగు తెరకి అశోక్ సెల్వన్ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. ఆయన సరసన నాయికలుగా రీతూ వర్మ - అపర్ణ బాలమురళి .. శివాత్మిక రాజశేఖర్ నటించారు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. 

ముగ్గురు కథానాయికలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సాయిపల్లవి చేతుల మీదుగా ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేయించారు. 'ఊపిరే హాయిగా .. మారెనే పదాలుగా, ఊహాలే తీయగా .. మారెనే నిజాలుగా' అంటూ ఈ పాట సాగుతోంది.  

అశోక్ సెల్వన్ - శివాత్మికపై రొమాంటిక్ గా ఈ పాటను చిత్రీకరించారు. గోపీసుందర్ అందించిన ట్యూన్ ఆహ్లాదకరంగా ఉంది. తేలికైన పదాలతో .. అర్థవంతమైన సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకుంటోంది. ఫీల్ తో సాగిన ఆలాపన ఈ పాటకు ప్రాణం పోసింది. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

More Telugu News