Srikanth Iyengar: సినిమాయే నా ప్రపంచం .. షూటింగు లేకపోతే బ్రతకలేను!: శ్రీకాంత్ అయ్యంగార్

Srikanth Iyengar Interview

  • విలక్షణ నటుడు అనిపించుకున్న శ్రీకాంత్ అయ్యంగార్ 
  • సినిమాలంటే తనకి పిచ్చి అంటూ వ్యాఖ్య 
  • వచ్చిన వేషాలను చేసుకుంటూ వెళతానంటూ వెల్లడి 
  • ఆ మూడు వేషాలు మాత్రం వేయనంటూ నవ్వులు


తెలుగులో కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నవారిలో శ్రీకాంత్ అయ్యంగార్ ఒకరుగా కనిపిస్తాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలలో తానేమిటనేది ఆయన నిరూపించుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "సినిమా ఏదైనా .. షూటింగు ఎక్కడైనా సెట్లో అందరిలో కలిసిపోయి పనిచేయడం నాకు అలవాటు. అందరూ కూడా నాతో చాలా ఆప్యాయంగా ఉంటూ ఉంటారు. ఎవరైనా ఇగో చూపిస్తే .. వాళ్లకి కాస్త దూరంగానే ఉంటాను.

" సినిమానే నా ప్రపంచం .. సెట్ లో అడుగుపెట్టేటప్పుడు నేను పొందే ఆనందం అంతా ఇంతా కాదు. రేపు షూటింగు ఉందని చెబితే .. ఈ రోజున నేను గాల్లో తేలిపోతూ ఉంటాను. సినిమా అంటే నాకు అంత ఇష్టం. నాతో ఫ్యామిలీ మెంబర్స్ లేకపోయినా .. భోజనం లేకపోయినా ఉండగలుగుతానుగానీ, సినిమా లేకుండా మాత్రం ఉండలేను" అని అన్నాడు. 

" నేను ఏ తరహా పాత్రలకి సెట్ అవుతాననేది తెలుసును గనుక, ఆ తరహా పాత్రలే నాకు ఇస్తారు. అందువలన నాకు వచ్చిన పాత్రలను చేస్తూ వెళుతుంటాను. కాకపోతే కొత్తదనం ఉండేలా చూసుకుంటాను. హీరోవేషం వేయను .. హీరోయిన్ వేషం కూడా వేయను .. చిన్నపిల్లల వేషం అసలే వేయను. ఈ మూడు తప్ప అన్ని వేషాలు వేస్తాను" అంటూ నవ్వేశాడు. 

Srikanth Iyengar
Interview
Tollywood
  • Loading...

More Telugu News